హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరవీరుడు డీఎస్పీకి పోలీసుల నివాళులు

MDK: తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న స్వర్గీయ డీఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహానికి పోలీసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తూప్రాన్ సీఐ వెంకట్ రాజా గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 1997 నవంబర్ 17న పిల్లుట్లలో జరిగిన మందుపాతర పేలుడులో డీఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.