హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు బైక్ ఢీ.. ఒకరి మృతి

NLG: పట్టణంలోని పానగల్ రైల్వే బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి బైక్‌ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో పానగల్‌కు చెందిన కొత్తపల్లి శ్రీకాంత్ (41) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన నల్గొండలోని ఫర్నిచర్ షాపులో సేల్స్‌మన్. బైక్‌పై ఉన్న తులసా సాయికృష్ణ తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టూటౌన్ ఎస్ఐ సైదాబాబు కేసు నమోదు చేశారు.