JN: ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నార్త్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
అమరవీరులకు కలెక్టర్ నివాళి


