SRD: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు మరువలేనివని సర్పంచ్ కృష్ణ ముదిరాజ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కంగ్టిలో స్థానిక పోలీసులతో కలిసి అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగానే నేడు ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ
'పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి'


