హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీనివాస మిత్రుల వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

KNR: కరీంనగర్‌లో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ గిద్దె పెరుమాళ్ ఆలయంలో బుధవారం శ్రీనివాస మిత్రుల తృతీయ వార్షికోత్సవ పోస్టర్, ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ప్రధాన అర్చకులు శంకర్ శర్మ సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోసేవ చేశారు. ఈ నెల 25న కోరుట్లలోని జీఎస్ గార్డెన్స్‌లో వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.