PDPL: ధర్మారం మండలంలో కుష్టు వ్యాధి గ్రస్తులను గుర్తించడానికి ఈనెల 22 నుంచి నవంబర్ 4 వరకు కుష్టు వ్యాధి నిర్ధారణ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుస్మిత తెలిపారు. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు ఉన్నవారు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
తెలంగాణ
అక్టోబర్ 22 నుంచి కుష్టు వ్యాధి నిర్ధారణ


