RR: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని హిమాయత్‌నగర్ వార్డులో వివిధ సంఘాల అధ్యక్షులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల సేవలను గౌరవించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ
పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుక


