SRCL: పోలీస్ అమరవీరుల దినోత్సవంను బుధవారం సిరిసిల్ల సర్దాపూర్ 17వ బెటాలియన్‌లో నిర్వహించారు. కమాండెంట్ ఛటర్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమరవీరుల త్యాగాలను గుర్తుచేశారు. 1959లో లడఖ్ సరిహద్దులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల సాహసం స్ఫూర్తిదాయకమని, శాంతిభద్రతల పరిరక్షణలో వారి పాత్ర మరువలేనిదని అన్నారు.
తెలంగాణ
సర్దాపూర్‌లో ఘనంగా అమరవీరుల దినోత్సవం


