ADB: ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షేక్ భిలాల్ బాయ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
టీఆర్ఎస్లో చేరిన ధరంపూరి BRS నేతలు


