హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పరకాలలో ఘనంగా దుర్గామాత నిమజ్జనోత్సవం.!

HMK: పరకాల ఆర్టీసీ డిపో సమీపంలో గల రేణుక ఎల్లమ్మ దేవాలయంలో దుర్గామాత నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి, రోజూ కుంకుమ పూజలు, అన్నప్రసాదాలు నిర్వహించారు. దసరా పండుగ ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.