నారాయణపేట మండలం బండగొండలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ప్రతిష్ఠించిన దుర్గామాతకు తొమ్మిది రోజులపాటు అలంకరించిన చీరలను వేలం వేయగా రూ.1.66 లక్షలకు భక్తులు దక్కించుకున్నారు. అనంతరం భక్తి పాటలు, బతుకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ అమ్మవారి నిమజ్జన ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: రూ.1.66 లక్షలకు అమ్మవారి చీరల వేలం


