హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాపన్నపేట పోలీస్ అమరవీరులకు నివాళి

MDK: జిల్లాలోని పాపన్నపేట పోలీస్ స్టేషన్‌పై 1999లో జరిగిన నక్సల్స్ దాడిలో ఐదుగురు పోలీసులు అమరులయ్యారు. వారి స్మారకార్థం పోలీస్ స్టేషన్ ఆవరణలో స్తూపాన్ని నిర్మించారు. ఏటా అమరవీరులకు నివాళులర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులను సత్కరిస్తారు. ఈ సందర్భంగా పోలీసులు వారి త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తారు.