హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్టును ఢీకొని యువకుడు మృతి

SRCL: ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామానికి చెందిన అక్షయ్(20) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మంగళవారం పోత్తూరు నుంచి కందికట్కూరు వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పండుగ వేళ ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికందిన కుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు.