హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సీతారాముల ఆలయంలో మహాహోమం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఇవాళ మహాపూర్ణాహుతి వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు హోమాది క్రతువులను పూర్తి చేశారు. ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా భక్తులు రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.