హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగంగా మర్పల్లి రైతు వేదిక

VKB: వికారాబాద్ జిల్లా మర్పల్లిలో రూ. 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక అధికారుల పర్యవేక్షణ లేక పిచ్చిమొక్కలు, చెత్తతో నిండి పాముల నిలయంగా మారింది. వార్తలు వస్తున్నా వ్యవసాయ శాఖలో చలనం లేదు. ఉన్నతాధికారులు స్పందించి వేదికను శుభ్రం చేయించి, అధికారులు అందుబాటులో ఉంటూ రైతు సేవలు, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలు పునరుద్ధరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.