మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో దసరా పండుగ ప్రశాంతంగా ముగిసిందని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా అన్ని గ్రామాలలో పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. దసరా సంబరాలు, జమ్మి కార్యక్రమాలకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ పండుగలను నిర్వహించుకున్నారన్నారు.
తెలంగాణ
'ప్రజలు పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకున్నారు'


