హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొనసాగుతున్న సద్దుల బతుకమ్మ సంబరాలు

ASF: బెజ్జూర్ మండలంలో బుధవారం ఉదయం 9గంటల సమయంలో సద్దుల బతుకమ్మ సంబరాలు కొనసాగాయి. 9 రోజులుగా మహిళలు, చిన్నారులు బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఉదయం వేళలో మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. నేటితో బెజ్జూరు మండల వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి.