హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోతుల బెడద, కాలనీవాసుల ఆవేదన

VKB: దోమ మండలంలోని మోత్కూరు హనుమాన్ కాలనీలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి, ఇంకెన్నాళ్లు ఈ పరిస్థితి, కోతుల బెడద పరిష్కారం చేస్తారా చేయరా అంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి తమను రక్షించాలని కోరారు. పిల్లలు బయటకు రాలేకపోతున్నారని వాపోయారు.