పెద్దపల్లి మండలం ధర్మాబాద్‌లో 300 ఏళ్ల నాటి చారిత్రక ఆలయం విశేషంగా ఆకట్టుకుంటోంది. కుతుబ్ షాహీ కాలంలో రాఘవాపూర్ సంస్థానాధీశులు ఆండాలమ్మ విగ్రహ ప్రతిష్ట కోసం ఈ గుడిని నిర్మించారు. అయితే నిర్మాణం పూర్తయినా ప్రతిష్ట జరగకపోవడంతో ఇక్కడ పూజలు లేవు. ప్రస్తుతం ఇది షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పురావస్తు శాఖ దీనిని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ఆ గుడిలో దేవుడు లేడు కానీ..!


