హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి సంరక్షణకు కఠిన చర్యలు

HYD: హైదరాబాద్‌లో భూగర్భ జలాల సంరక్షణకు HYDRAA, HMWSSB సంయుక్తంగా చర్యలు చేపడుతున్నాయి. నవంబర్ 1 నుంచి నిర్మాణాలు, ల్యాండ్‌స్కేపింగ్‌కు శుద్ధి చేసిన మురుగునీటిని తప్పనిసరిగా వినియోగించాలి. రోజుకు 100 మిలియన్ లీటర్ల వినియోగమే లక్ష్యంగా గ్రీన్ ట్యాంకర్ కేంద్రాలను 13 నుంచి 30కి పెంచనున్నారు. నీటి వృథాపై తనిఖీలు ముమ్మరం చేయనున్నారు.