హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నారా?

ఆయిల్ పుల్లింగ్ ద్వారా నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం పరగడుపున కొబ్బరి లేదా నువ్వుల నూనెను నోటిలో వేసుకుని 10-15 నిమిషాల పాటు పుక్కిలించి ఊసేయాలి. ఇలా చేయడం వల్ల నోట్లోని హానికర బ్యాక్టీరియా, టాక్సిన్లు తొలగిపోతాయి. నోటి దుర్వాసన సమస్య తగ్గి.. పళ్లు, చిగుళ్లు దృఢంగా మారతాయి. అయితే, ఆయిల్ పుల్లింగ్ బ్రషింగ్‌కు ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి.