హైదరాబాద్: 28°C
వార్తలు

మైసూరు ప్యాలెస్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్

TG: పోలీస్ అమరవీరుల స్మారక పరేడ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ప్రసిద్ధ మైసూరు ప్యాలెస్‌లో జరిగే దసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా రాత్రి నిర్వహించే అత్యంత ఆకర్షణీయమైన టార్చ్ లైట్ పరేడ్ ఉత్సవాలను సీఎం వీక్షిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ రాత్రి ఆయన కర్ణాటకలోని మైసూరులోనే బస చేయనున్నారు.