హైదరాబాద్: 28°C
వార్తలు

దుర్గామాత విగ్రహ నిమజ్జనాలు.. నలుగురు మృతి

దేశవ్యాప్తంగా దుర్గామాత విగ్రహ నిమజ్జనాల్లో పలుచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. రాజస్థాన్ కోటలో నిమజ్జనం కోసం ఏడుగురు వ్యక్తులతో వెళ్తున్న పడవ నీటిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఈత వచ్చిన ముగ్గురు ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా, మరో నలుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు.