హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి భారత్‌లో పోలాండ్ ప్రధాని పర్యటన

పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ్టి నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీతో కీలక ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, పెట్టుబడుల వృద్ధి వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. డొనాల్డ్ టస్క్ పర్యటనతో భారత్-పోలాండ్ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.