హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంటిమిట్టలో 144 సెక్షన్ అమలు: సీఐ

KDP: MPTC నామినేషన్ల నేపథ్యంలో ఒంటిమిట్ట మండలంలో ఈ నెల 23వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని CI వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఒంటిమిట్ట MPDO కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ సందర్భంగా కార్యాలయం చుట్టూ 100 మీటర్ల పరిధిలోకి ఇతరులను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా నిబంధనలు పాటించాలని సూచించారు.