తమిళనాడు ఈరోడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామనాథపురంకు చెందిన ఉత్తిర అనే మహిళ పళ్లగౌండంపాలయంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అయితే ఈ నెల 17న ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు.. సహోద్యోగి బంగారం కోసం ఆమెను హత్య చేసి తాళిని దొంగిలించినట్లు వెల్లడించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
వార్తలు
బంగారం కోసం మహిళ హత్య.. సహోద్యోగి అరెస్ట్


