ఢిల్లీ ప్రజలకు మంత్రి పర్వేశ్ వర్మ కీలక అభ్యర్థన చేశారు. పుట్టిన రోజు వంటి ప్రత్యేకమైన వేడుకలను యమునానది ఒడ్డున జరుపుకోవాలని సూచించారు. వచ్చే నెల 7న తన పుట్టినరోజు వేడుకలను కూడా నది ఒడ్డున చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కుటుంబాలు ఒక దగ్గర చేరి వేడుకలు చేసుకునేందుకు నది తీరాల్లో కొన్ని ప్రత్యేక కుటీరాలను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
వార్తలు
నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి: ఢిల్లీ మంత్రి


