హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వజ్రకవచ అలంకరణలో అమ్మవారు దర్శనం

ATP: గుత్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదో రోజు మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని వజ్ర కవచంతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ, గత తొమ్మిది రోజులుగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.