ASR: ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే ప్రధాన జోలాపుట్టు జలాశయ నీటి మట్టం నిలకడగా ఉంది. గత నెల వరకు భారీ వర్షాలతో ప్రమాద స్థాయికి చేరుకున్న జలాశయ నీటి మట్టాన్ని క్రమేపి అధికారులు తగ్గిస్తూ వచ్చారు. దీంతో నీటి మట్టం స్థాయి సాధారణ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం నీటి మట్టం 2,546.65 అడుగులుగా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
నిలకడగా జోలాపుట్టు నీటి మట్టం


