AKP: కోటవురట్ల మండల పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీల నామినేషన్ కేంద్రం వద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఏఆర్వో చంద్రశేఖర్ తెలిపారు. ఒకటి కేంద్రం బయట, మరొకటి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ స్వీకరించే చోట ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేయడానికి మండల పరిషత్ కార్యాలయంలో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీసీ కెమెరాలు ఏర్పాటు


