హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాటర్ పార్క్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

ప్రకాశం: దసరా సెలవులను ఆనందంగా గడిపేందుకు వాటర్ పార్క్‌కు బయలుదేరిన కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదం ఎదురైంది. ఒంగోలు ఇస్లాంపేట్‌కు చెందిన కొందరు లైలాండ్ వాహనంలో కనిగిరి వాటర్ పార్క్‌కు వెళ్తుండగా చీమకుర్తి హైవేపై టైరు పగిలి వాహనం బోల్తా పడింది. ఘటనను గమనించిన స్థానికులు  క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.