హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలింపు?

ప్రకాశం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అద్దంకిలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులను సోమవారం రాత్రి ప్రత్యేక వాహనంలో ఇతర ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఉండేందుకు పార్టీ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.