హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులకు బీ-ఫారాలు

విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థులకు మంగళవారం టీడీపీ కార్యాలయంలో బీ-ఫారాలు అందజేశారు. మేయర్ అభ్యర్థిగా అవనపు భార్గవికి, కార్పొరేటర్ అభ్యర్థులుగా టీడీపీ నుంచి 48 మందికి, జనసేన నుంచి 10 మందికి, బీజేపీ నుంచి నలుగురికి బీ-ఫారాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం మాధవి, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.