ELR: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగరవేయడం ఖాయమని మండల టీడీపీ అధ్యక్షుడు ఉంగుటూరు సుధీర్ అన్నారు. మంగళవారం ఉంగుటూరులో జరిగిన టీడీపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 23 ఎంపీటీసీ స్థానాలు, జడ్పీటీసీ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంటుందన్నారు. ఎంపీపీ అభ్యర్థిగా అక్కిన నాగమణి, జడ్పీటీసీ అభ్యర్థిగా చింతల వాసు పేర్లను ఖరారు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో కూటమి జెండా ఎగరవేస్తాం: సుధీర్


