హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీకి అన్నామలై మద్దతు

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, వీ ది లీడర్స్ ఉద్యమ వ్యవస్థాపకుడు అన్నామలై సీజేపీకి మద్దతు తెలపటం చర్చనీయాంశమైంది. సీజేపీ విషయంలో ఢిల్లీ పోలీసుల వ్యవహారశైలిపై మండిపడ్డారు. సీజేపీ నిరసన పద్ధతులు, కొన్ని చర్యలతో తాను ఏకీభవించకపోయినా.. వారు లేవనెత్తిన ప్రశ్నలకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.