హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి

అన్నమయ్య: చిట్వేలి మండల కేంద్రం సమీపంలోని పాత చిట్వేలిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో భద్రకాళి, రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాలలో చివరగా దశమి రోజున ఆలయంలోని ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాజరాజేశ్వరి దేవిని అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు.