WGL: పట్టణంలోని గవిచర్ల ఎక్స్ రోడ్డు వద్ద దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై బీర్ బాటిల్తో దాడి చేయడంతో అతని కంటికి తీవ్ర గాయమైంది. మిల్స్ కాలనీకి చెందిన నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం ఎంజీఎం (MGM) ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
తెలంగాణ
బీర్ బాటిల్తో వ్యక్తిపై దాడి..!


