హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ భవనానికి భూమిపూజ

NGKL: పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేట గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవనానికి దసరా రోజున సర్పంచ్ మానస రాకేష్ భూమిపూజ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నిధులు మంజూరు చేశారు. భవనం అందుబాటులోకి వస్తే ప్రజలకు మెరుగైన పాలన సేవలు అందించడం సులభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నిర్మల, సభ్యులు పాల్గొన్నారు.