హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధపూజ

KMM: ఖమ్మం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విజయదశమి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆయుధపూజ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఈ కార్యక్రమంలో పాల్గొని పోలీస్ శాఖ ఆయుధాలు, వాహనాలకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.