GDW: మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామంలో సీజనల్ వ్యాధుల నివారణకు సర్పంచ్ ఆల్వాల శిరీష పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ప్రధాన వీధులు, మురుగు కాలువలు, ఆలయ పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మి నర్సిములు, వార్డు సభ్యుడు శివ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి


