హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాజులగట్టులో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ

MHBD: గూడూరు మండలం గాజుల గట్టులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గోపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న అణగారిన వర్గాల కోసం భూస్వాములు, మొఘల్ సామ్రాజ్యవాదులపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడని కొనియాడారు. కార్యక్రమంలో విగ్రహదాత కృష్ణ గౌడ్, సుభాష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.