అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని అధికారులు కోరారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం అన్ని మండలాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రశాంత ఎన్నికలకు రాజకీయ పార్టీలు సహకరించాలి'


