హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాట నిలబెట్టుకున్న మేకగూడ PACS చైర్మన్

RR: కొత్తూరు మండలం ఎస్. బి. పల్లిలో తాగునీటి సమస్యను తీర్చేందుకు మేకగూడ PACS చైర్మన్ అంబటి ప్రభాకర్ తన సొంత నిధులతో బోరు మోటార్‌ను ఏర్పాటు చేశారు. వినాయక లడ్డు ప్రసాదం నిధులతో స్థానిక యూత్ కమిటీ బోరు బావిని వేయించగా, మోటార్ ఖర్చులను అంబటి ప్రభాకర్ భరిస్తానని హామీ ఇచ్చారు. విజయదశమి పర్వదినాన సర్పంచ్ మాల్‌రెడ్డి సుమిత్రతో కలిసి ఈ మోటార్‌ను ప్రారంభించారు.