భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో దసరా సందర్భంగా వాహన పూజలు నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ శర్మ ప్రభుత్వ వాహనాలకు ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, ఉద్యోగులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. వాహనాల వినియోగం సురక్షితంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
కలెక్టరేట్లో వాహన పూజలు


