హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్కింగ్ సమస్య.. ట్రాఫిక్ కష్టాలు!

MBNR: జడ్చర్లలోని జీవీ మాల్‌, గరుడ వస్త్ర సిల్క్స్‌ వద్ద పార్కింగ్‌ సదుపాయాలు లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలను రహదారులపైనే నిలపడంతో సిగ్నల్‌ గడ్డ నుంచి కొత్త బస్టాండ్‌ వరకు ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతోంది. వాణిజ్య సముదాయాలకు అనుమతులు ఇచ్చే సమయంలో పార్కింగ్‌ సదుపాయాలను పరిశీలించారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.