భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 22 నుంచి సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులు సూచించారు. కనీస మద్దతు ధర పొందాలంటే పత్తి విక్రయ సమయంలో ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 1.09 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు.
తెలంగాణ
ఈ నెల 22 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం


