RR: షాద్‌నగర్ పట్టణంలోని ఈశ్వర్ కాలనీలో విజయదశమిని పురస్కరించుకుని అభయ ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో మంగళవారం సాయంత్రం రావణ దహన మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. చెడుపై మంచి విజయోత్సవంగా జరిగే ఈ వేడుకకు సర్వం సిద్ధమైందన్నారు. ఈ వేడుకకు కాలనీ, పట్టణ ప్రజలు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
రావణ దహన వేడుకలకు సర్వం సిద్ధం


