గత 10–12 రోజులుగా ఉద్యమకారులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని సీజేపీ అధినేత అభిజీత్ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వాలంటీర్లపై దాడులు జరిగాయని, మరికొందరిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఉద్యమం కోసం కార్యకర్తలు తీసుకున్న నిర్ణయాల ప్రభావం వారి కుటుంబాలపైనా పడుతోందని తెలిపారు. అందుకే పండుగల సమయంలో కుటుంబ సభ్యులతో గడపాలని, వారి ఆందోళనను అర్థం చేసుకోవాలని అభ్యర్థించారు.
వార్తలు
కుటుంబాల గురించి కూడా ఆలోచించండి: అభిజిత్


