హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలు.. పోలీసుల ఫ్లాగ్ మార్చ్

అన్నమయ్య: మదనపల్లె పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా SP ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ముసల్రెడ్డిగారిపల్లె, యండపల్లె, బోయపల్లె గ్రామాలతో పాటు పీలేరు పట్టణంలో మంగళవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలకు భరోసా కల్పిస్తూ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.