KDP: విజయదశమి సందర్భంగా మంగళవారం కడప జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని ఆయుధాగారంలో SP నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఆయుధాలు, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతి ఇచ్చారు. పోలీసు సిబ్బంది, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు సిబ్బందికి, ప్రజలకు SP దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ


